మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh200,000 వరకు జరిమానా, జైలు శిక్ష
- February 07, 2024
యూఏఈ: కొత్తగా ప్రవేశపెట్టిన ఫెడరల్ చట్టం మే 30, 2024 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం మానసిక ఆరోగ్య రోగులకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే Dh200,000 జరిమానా మరియు రోగికి తీవ్రమైన గాయం లేదా శారీరక వైకల్యానికి కారణమైతే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షను విధిస్తారు. కొత్త చట్టంలో మానసిక ఆరోగ్య రోగులకు సంబంధించిన అనేక రకాల కొత్త నిబంధనలతో పాటు జరిమానాల వివరాలను పొందుపరిచారు. గలాదరి లీగల్ కన్సల్టెంట్ సీనియర్ న్యాయవాది స్టీఫెన్ బాలంటైన్ మాట్లాడుతూ..ఒక వ్యక్తిని మానసిక ఆరోగ్య సౌకర్యం కోసం అనుమతించడం లేదా డిశ్చార్జ్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా సరికాని సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా అందించిన వారికి చట్టం కఠినమైన జరిమానాలను విధిస్తుంది. వీటితో పాటు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతని/ఆమె మెడికల్ రిపోర్ట్‌లో మానసిక స్థితికి సంబంధించి వాస్తవికతకు విరుద్ధంగా పేర్కొన్నట్టయితే చట్టం Dh50,000 కంటే తక్కువ కాకుండా మరియు Dh200,000 మించకుండా జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారికి తగిన సంరక్షణ మరియు వారికి తగిన గౌరవం లభించేలా చూడడానికి జరిమానాలు ప్రవేశపెట్టబడ్డాయి అని బాలంటైన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







