స్కామర్ల ఉచ్చు.. వినియోగదారులను హెచ్చరించిన ZATCA
- February 07, 2024
రియాద్ : జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికారులమంటూ మోసపూరిత టెక్స్ట్, ఇమెయిల్ సందేశాలు పంపే స్కామర్ల ఉచ్చులో పడొదందరి హెచ్చరిక జారీ చేసింది. రీఫండ్ పేరుతో స్కామర్లు ఉచ్చును వేస్తారని, అలాగే మోసగాళ్లు కస్టమర్ల వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ డేటాకు కూడా యాక్సెస్‌ను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ZATCA తెలిపింది. అథారిటీకి చెల్లించిన మొత్తాలను వాపసు చేయమని, మరింత సమాచారం కోసం లేదా డేటాను అప్డేట్ చేసుకోవాలని లేదా ఎలక్ట్రానిక్ ఫారమ్‌లను పూరించడానికి ఎలక్ట్రానిక్ లింక్‌లకు క్లిక్ చేయాలని వంటి పలు అనుమానాస్పద సందేశాల ద్వారా వ్యక్తిగత, బ్యాంకింగ్ డేటాను పొందడం వంటి మోసపూరిత పద్ధతులను స్కామర్లు అవలంబిస్తున్నారని అథారిటీ పేర్కొంది. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అథారిటీ వెబ్సైట్ ( zatca.gov.sa ) మరియు ZATCA అప్లికేషన్ అయిన అధికారిక ఛానెల్‌ల ద్వారా తప్ప ఇతర మార్గాల ద్వారా బ్యాంక్ కార్డ్‌లకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని యాక్సెస్ చేయొద్దని కోరింది. కాల్ సెంటర్ (19993) లేదా “ఆస్క్ జకాత్, టాక్స్ మరియు X ప్లాట్‌ఫారమ్‌లోని కస్టమ్స్" ఖాతా (@Zatca_Care@ లేదా ఇ-మెయిల్ ద్వారా ( [email protected] ) లేదా అధికార వెబ్సైట్ ద్వారా వెరిఫై చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం







