సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ
- February 12, 2024
హైదరాబాద్: బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు బొంతు రామ్మోహన్.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉంది. అయితే, గెలిచిన వారంతా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగర శివారుకి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి ఉంది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిశారు. చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కు సంబంధించి హామీ లభించడం వల్ల వారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు అనే ఊహాగానాలు వినిపడుతున్నాయి. త్వరలోనే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తనతో పాటు కొందరు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లేందుకు మహేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..
హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారంతా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. గ్రేటర్ లో బలమైన నేతలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్ మేయర్ గా పని చేసిన బొంతు రామ్మోహన్.. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత జీహెచ్ఎంసీ తొలి మేయర్ గా పని చేసిన వ్యక్తిగా బొంతు రామ్మోహన్ గుర్తింపు పొందారు. అదే విధంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బాబా ఫసియుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు.
బొంతు రామ్మోహన్ మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ఉప్పల్ బీఆర్ఎస్ టికెట్ ను ఆశించి భంగపడ్డారు. తాజాగా కారు దిగి హస్తం గూటికి చేరాలని చూస్తున్నారు. బొంతు రామ్మోహన్ మల్కాజ్ గిరి లోక్ సభ టికెట్ ఆశిస్తున్నా.. కాంగ్రెస్ మాత్రం ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- ధోఫర్‌లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!
- గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!
- ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- దుబాయ్ సర్జన్ క్రెడిట్ కార్డ్ హ్యాక్..Dh120,000 ఖాళీ..!!