ఫిబ్రవరి 16న అబ్దాలిలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్

- February 12, 2024 , by Maagulf
ఫిబ్రవరి 16న అబ్దాలిలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 16న కువైట్‌లోని అబ్దాలీ ప్రాంతంలో కాన్సులర్ క్యాంపును నిర్వహించ‌నుంది.  సలాహ్ ఫలాహ్ ఫహద్ ఆజ్మీ ఫామ్ (సుబియా రోడ్, బ్లాక్ 06, చిన్న జామియా దగ్గర, అబ్దాలి)లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు కాన్సులర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. క్యాంపు సమయంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే పంపిణీ చేయబడతాయని, అబ్దాలీ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయానికి రాకుండా ఈ సేవలను పొందేందుకు ఈ శిబిరం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, క్యాంప్ సైట్‌లో నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com