సౌదీ అరేబియా మరిన్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్లు
- February 15, 2024
రియాద్: గ్లోబల్ స్మార్ట్ సిటీ ఫోరమ్ 2024 యొక్క మొదటి ఎడిషన్ మంగళవారం రియాద్‌లో ముగిసింది. సౌదీ అరేబియా మరిన్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్లను రూపొందించడానికి సిద్ధంగా ఉందని ఫోరంలో వెల్లడించారు. రెండు రోజులపాటు ఫోరమ్‌లో స్మార్ట్ సిటీల భవిష్యత్తు మరియు వాటి మౌలిక సదుపాయాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అనేక చర్చలు జరిగాయి. స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్ల వల్ల భవిష్యత్‌లో తయారీ, మైనింగ్ రంగాల్లో గొప్ప అవకాశాలు ఉంటాయని ఫోరంలో వక్తలు వెల్లడించారు. రియాద్ అరేనాలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) నిర్వహించిన ఫోరమ్‌ను మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రి మజేద్ అల్-హోగైల్ ప్రారంభించారు. 40 దేశాలకు చెందిన గ్లోబల్ సిటీ నిపుణులు, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ సొల్యూషన్స్‌లో నిపుణులు, స్మార్ట్ సిటీ ఇంజనీర్లు, ఇన్వెస్టర్లు మరియు ఎకనామిక్ పాలసీ మేకర్లు “ఎ బెటర్ లైఫ్” అనే థీమ్‌తో జరిగిన సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పారిశ్రామిక మరియు ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలను పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక వ్యాప్తి మరియు స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధికి ఇంజిన్లలో ఒకటిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







