బిజీ బిజీగా ప్రియమణి.!
- February 15, 2024
అందాల నటి ప్రియమణి.. కేవలం అందమే కాదు.. మంచి టాలెంట్ వున్న నటి కూడా. హీరోయిన్‌గా రాణించడంతో పాటూ.. అప్పుడప్పుడూ కొన్ని స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించి మెప్పించింది.
ఇక ఇప్పుడు అప్పుడప్పుడూ సినిమాలతో పాటూ, ఓటీటీపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రియమణి. ఓటీటీలో చిన్న చిన్న సినిమాలతో పాటూ, సిరీస్‌ల్లోనూ సత్తా చాటుతోంది.
ఓ మలయాళ సినిమాలో మొన్నా మధ్య మోహన్ లాల్‌కి పోటీగా నటించి మెప్పించింది. తాజాగా ‘భామా కలాపం’ అనే తెలుగు వెబ్ సిరీస్‌తో రాబోతోంది. ఆల్రెడీ ఈ సిరీస్‌కి సంబంధించి మొదటి పార్ట్ గతంలో ఓటీటీ ప్రేక్షకులచే మంచి ఆదరణ పొందింది.
తాజాగా ‘భామా కలాపం 2’ స్ర్టీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఓ సాధారణ గృహిణి.. చేసే సాహసాలను కాస్త హ్యూమరస్‌గా తెరకెక్కించారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో పార్ట్‌లో ప్రియమణి ఎలా సత్తా చాటింది.? ప్రేక్షకుల ప్రశంసలు ఎలా వున్నాయ్ తెలియాల్సి వుంది.
మొదటి పార్ట్ ఆదరణను బట్టి.. రెండో పార్ట్ పైనా ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయ్. ఈ సిరీస్‌ని ప్రమోట్ చేసే విధానం కూడా ఆకట్టుకుంటోంది. సో, చూడాలి మరి, అనుపమగా ‘భామా కలాపం 2’లో ప్రియమణి టాలెంట్ ఎంత మేర వర్కవుట్ అయ్యిందో. అన్నట్లు ఈ సిరీస్‌లో సీరత్ కపూర్, శరణ్య ఇతర కీలక పాత్రల్లో ప్రియమణికి సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







