చమురు సంక్షోభం: విద్యపై తీవ్ర ప్రభావం
- June 02, 2016
అంతర్జాతీయంగా నెలకొన్న చమురు ధరల సంక్షోభం ఒమన్‌లో తీవ్ర ప్రభావం చూపుతోందనీ, ఈ ప్రభావం ఒమన్‌లోని విద్యారంగంపైనా పడిందని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మదిహా అల్ షైబాని చెప్పారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా విద్యా సంస్థలకు భవనాల్ని కేటాయించడం కష్టమవుతోందని కొత్త భవనాలు నిర్మించడానికి ఆర్థిక స్థితిగతులు సహకరించడంలేదని ఆయన అన్నారు. అలాగే, టీచర్ల కొరత కూడా విద్యారంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన చెప్పారు. విద్యారంగంపై షురా కౌన్సిల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అల్ షైబాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్స్పాట్రియేట్ టీచర్ల సంఖ్య 10,000కి పైగానే ఉందని, ఒమనైజేషన్ ఈ రంగంలో జరగడానికి 20 ఏళ్ళ పైనే పడుతుందని ఈ సందర్భంగా షురా కౌన్సిల్ - ఎడ్యుకేషన్ కమిటీహెడ్ ఖాలిద్ అల్ ఫెరారి చెప్పారు. ఆర్థిక కేటాయింపులు జరిగాక టీచర్లను ప్రమోట్ చేయడానికి వీలవుతుందని ఈ సందర్భంగా అల్ షైబాని చెప్పారు. 2016లో ఒమన్‌లో 1,068 స్కూళ్ళు ఉన్నాయనీ, 2011తో పోల్చితే ఈ రంగంలో పెరుగుదల 2.7 శాతంగా ఉందని అన్నారు. 2016లో విద్యార్థుల సంఖ్య 500,000గా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







