సౌదీలో 14 మంది తీవ్రవాదులకు ఉరిశిక్ష
- June 02, 2016
సౌదీ అరేబియాలో 14 మంది వ్యక్తులకు తీవ్రవాదంతో సంబంధాలున్నాయన్న కారణంగా ఉరిశిక్ష విధించారు. ఈస్టర్న్ ప్రావిన్స్‌లోని ఖాతిఫ్‌లో పోలీసులపై వీరు దాడి చేశారు. మరో 9 మందికి ఈ కేసులో 3 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించబడింది. 2011-14 మధ్య జరిగిన నిరసనల్లో 20 మంది ఆందోళనకారులు మరియు పలువురు పోలీసు అధికారులు మృతి చెందారు. జనవరి 2న సౌదీ అరేబియా నలుగురు ఈస్టర్న్ ప్రావిన్స్ యాక్టివిస్టుల్ని ఎగ్జిక్యూట్ చేసింది. సౌదీ అరేబియా తమ జ్యుడీషియరీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. సున్నీ, షియాతీస్ అనే బేధభావం ఎక్కడా చూపబోమని, రాజకీయ కారణాలతో కొందరు కుట్రపూరితంగా ప్రజల్ని రెచ్చగొట్టి విధ్వంసాలకు దిగడం ద్వారా సామాన్యుల్ని, అలాగే భద్రతా సిబ్బందిని హతమార్చడం హేయమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







