చరిత్ర సృష్టించిన దుబాయ్‌కి చెందిన 9 ఏళ్ల బాలుడు..!
- February 17, 2024
యూఏఈ: దుబాయ్‌కి చెందిన 9 ఏళ్ల అయాన్ ఇటీవల అమెరికా ఖండంలోని మౌంట్ అకాన్కాగువాలోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. దీని ఎత్తు దాదాపు 20,000 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దుబాయ్‌లోని నార్త్ లండన్ కాలేజియేట్ స్కూల్ లో చదువుతున్నాడు. కఠినమైన వాతావరణ పరిస్థితుల వంటి అనేక అడ్డంకులను ఎదుర్కొన్నట్లు అయాన్ పేరెంట్స్ సబూర్, వాణి తెలిపారు. చిన్న వయసులో పర్వతాన్ని అధిరోహించేందుకు కోర్టు నుండి అనుమతి పొందినట్లు వెల్లడించారు. దీనికంటే ముందు అయాన్ మౌంట్ ఎల్బ్రస్ (రష్యా), మౌంట్ కిలిమంజారో (టాంజానియా), మౌంట్ కోస్కియుస్కో (ఆస్ట్రేలియా) మరియు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (నేపాల్)లను అధిరోహించాడు. కాగా, 16 సంవత్సరాల వయస్సులో హిమాలయాల శిఖరాలను చేరుకోవాలని, దాంతో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 14 శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలవాలనేది తన లక్ష్యంగా అయాన్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక







