ఏవియేషన్ మ్యూజియంగా ఓల్డ్ సీబ్ ఎయిర్పోర్ట్..
- February 18, 2024
మస్కట్: చారిత్రాత్మకమైన సీబ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వియేషన్ మ్యూజియంగా మార్చనున్నారు. పాత సీబ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కరోనా మహమ్మారి సమయంలో ఫీల్డ్ హాస్పిటల్‌గా కూడా పనిచేసింది. పాత విమానాశ్రయాన్ని ఏవియేషన్ మ్యూజియంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ఆవిష్కరించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సుల్తానేట్‌లో తొమ్మిది దశాబ్దాల విమానయాన అభివృద్ధిని వివరించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్ ఇంజనీర్ నయేఫ్ బిన్ అలీ అల్ అబ్రి తెలిపారు. డిసెంబర్ 23, 1973న, సీబ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1, 2008న సీబ్ అంతర్జాతీయ విమానాశ్రయంను మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చారు. మార్చి 20, 2018లో ఒమన్ అత్యాధునిక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







