హమాస్‌తో చర్చల నిలిపివేతపై స్పందించిన ఇజ్రాయిల్ ప్రధాని
- February 18, 2024
టెల్ అవీవ్: హమాస్‌తో చర్చల నిలిపివేత పై ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ విజ్ఞప్తి మేరకు ఇజ్రాయిల్ హమాస్‌తో సంధి చర్చల కోసం కైరోకు ప్రతినిధులను పంపిన సంగతి తెలిసిందే. అయితే గత మంగళవారం నుంచి చర్చలు స్తంభించిపోయాయి. ఈ అంశంపై శనివారం ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. హమాస్ డిమాండు అసంబద్ధంగా ఉన్నాయని, అందుకే చర్చలను నిలిపివేశామని అన్నారు.
యుద్ధం నిలిపివేయడంతో పాటు గాజాను హమాస్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని, అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వందలాది హంతకులకు విడిచిపెట్టాలని కోరారని అన్నారు. జెరూసలెంలో వివాదాస్పదంగా ఉన్న పవిత్ర స్థలంపైనా అసంబద్ధ డిమాండ్లు చేస్తున్నారని అన్నారు. హమాస్ డిమాండ్లలో ఎలాంటి మార్పు కనిపించలేదని అన్నారు. దీంతో వారితో తాము చర్చలను కొనసాగించమని అన్నారు. పాలస్తీనా స్వతంత్ర హోదాపై అంతర్జాతీయ ఆదేశాలకు లొంగదని అన్నారు. పాలస్తీనా గుర్తింపు అంశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అలా జరగాలంటే ఎలాంటి షరతులు లేకుండా ఇరు పక్షాల మధ్య చర్చలతోనే సాధ్యపడాలన్నారు.
అయితే సంధి చర్చలు నిలిచిపోవడానికి ఇజ్రాయిలే కారణమని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఆరోపించారు. గాజా నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ, పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు. ఈ చర్చలకు ఈజిప్టు, ఖతర్ మధ్యవర్తిత్వం వహించాయి. కానీ, ఇజ్రాయెల్ మరోమారు చర్చలకు వెళ్లకపోవటంతో మంగళవారం నుంచి అవి నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







