దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దొరికిన తప్పిపోయిన ఇండియన్ యువకుడు
- February 19, 2024
యూఏఈ: ఇండియన్ యువకుడు 24 గంటల తర్వాత దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దొరికాడు. ఆదివారం ఆటిజంతో బాధపడుతున్న 18 ఏళ్ల ఫెలిక్స్ జెబీ తప్పిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి దుబాయ్ విమానాశ్రయం పరిసరాల్లో విజయవంతంగా గుర్తించినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. "దేవుని దయతో, అతను మాతో ఉన్నాడు" అని అతని తండ్రి జెబీ థామస్ తెలియజేశాడు. కష్టకాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, అతను సిటీ సెంటర్ షార్జా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1కి ఎలా చేరుకున్నాడు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. విమానాశ్రయంలో ఫెలిక్స్‌ను గుర్తించిన కువైట్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







