‘పుష్ప’ సినిమాపై బన్నీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.!
- February 19, 2024
‘పుష్ప’ సినిమాని కోవిడ్ టైమ్‌లో తెరకెక్కించారు. ఓ మోస్తరు అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్యంగా సంచలనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ సెన్సేషన్‌తో పుష్ప 2 పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయ్. దాంతో, సినిమా తెరకెక్కించడంపైనా జాగ్రత్తలు పెరిగిపోయాయ్. ఆచి తూచి.. అత్యధికంగా టైమ్ తీసుకుని (దాదాపు ఐదేళ్లు పడుతుంది సినిమా రిలీజ్ అయ్యేసరికి) ‘పుష్ప 2’ని తెరకెక్కిస్తున్నారు.
ఇక, తాజాగా ఓ ఫిలిం పెస్టివల్‌కి అతిధిగా హాజరైన అల్లు అర్జున్.. ‘పుష్ప 3’ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవునండీ మీరు విన్నది నిజమే.. ‘పుష్ప 2’నే కాదు, మూడో పార్ట్ కూడా వుందట. మూడే కాదు.. అలా వస్తూనే వుంటాయట. ఫ్రాంచైజీల్లా ‘పుష్ప’ని సిద్ధం చేయాలనుకుంటున్నారట.
అందుకోసం బోలెడన్ని స్టోరీ లైన్లు కూడా సెట్ చేసుకున్నారట సుక్కు అండ్ టీమ్. అదే బన్నీ మాటల్లోనే వెల్లడయ్యింది. మొత్తానికి ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇక, రాబోయే కాలంలో ‘పుష్ప’ ఫ్రాంచైజీలంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీనే.
ఇక, మొదటి పార్ట్‌లో నటించిన కీలక పాత్రధారులంతా.. రెండో పార్టులోనూ కనిపించబోతున్నారు. అంతకు మించి అనేలా రెండో పార్ట్ ‘పుష్ప’ వుండబోతోంది. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







