టిల్టుగాని కోసం అనుపమ అంత తీసుకుందా.?
- February 19, 2024
‘టిల్లు స్క్వేర్’లో అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించడం వెనక అనుపమ పెద్ద స్కెచ్చే వేసిందట. ఇప్పటికే అనుపమ పాత్ర ఎలా వుండబోతోందో ఈ సినిమాలో అందరికీ ఓ ఐడియా వచ్చేసింది.
చాలా హాట్‌గా అంతకన్నా ఘాటుగా వుండబోతోందనీ ప్రోమోల ద్వారా అర్ధమైపోయింది. అయితే, ప్రోమోల్లో చూపించిన దానికన్నా మించి సినిమాలో వుండబోతోందట అనుపమ పాత్రలోని ఘాటు. అలాగే, పర్‌ఫామెన్స్ కూడా అదే రేంజ్‌లో వుండబోతోందనీ తెలుస్తోంది.
‘డీజె టిల్లు’ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత ప్రబావితం చూపించిందో అందరికీ తెలిసిందే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతోనే నేహా శెట్టికి అంత పాపులారిటీ వచ్చింది.
అసలే పాపులర్ అయిన అనుపమ పరమేశ్వరన్‌కి ఈ సినిమాతో ఇంకెంత పాపులారిటీ వస్తుందో ఏమో కానీ.. ఈ సినిమాలో ఈ రేంజ్‌లో హాట్‌నెస్ ప్రదర్శించడానికి అనుపమ అయితే, గట్టిగానే ఛార్జ్ చేసిందట. ఇంతవరకూ తన కెరీర్‌లో తీసుకున్న రెమ్యునరేషన్‌కి కొన్ని రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ ఈ సినిమాకి తీసుకుందని ప్రచారం జరుగుతోంది.
ఏమో ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, ఇంత ఘాటు రొమాన్స్ కారణంగా అనుపమ కెరీర్ ఎటు టర్న్ అవ్వనుందో తెలియాలంటే ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ వరకూ లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







