'సాలరీ ఇన్ అడ్వాన్స్' సౌకర్యాన్ని నిలిపివేసిన టాప్ బ్యాంక్
- February 21, 2024
యూఏఈ: యూఏఈ టాప్ దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్.. కస్టమర్‌ల కోసం 'సాలరీ ఇన్ అడ్వాన్స్' సదుపాయాన్ని నిలిపివేసింది. తన ఆర్థిక ఉత్పత్తులను పూర్తిగా మూల్యాంకనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. "మా ఆర్థిక ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను జాగ్రత్తగా పరిశీలించి.. సమగ్ర మూల్యాంకనం చేసిన తర్వాత మా శాలరీ ఇన్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం." అని దుబాయ్ ఆధారిత బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. అయితే, అనేక ఇతర స్థానిక బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. DIB 'సాలరీ ఇన్ అడ్వాన్స్' సదుపాయాన్ని చాలా మంది యూఏఈ నివాసితులు ఆర్థిక సంక్షోభం, ఇతర అత్యవసర వ్యక్తిగత అవసరాల సమయంలో వినియోగించుకున్నారు. కస్టమర్‌లు అడ్వాన్స్ జీతం కోసం ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ATMల ద్వారా రెండు వందల దిర్హామ్‌లు చెల్లించి సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ గ్రూప్ గత నెలలో 2023కి సంబంధించి Dh7 బిలియన్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 26 శాతం అధికం.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







