దుబాయ్‌లో $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ టూరిస్ట్
- February 22, 2024
దుబాయ్: బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రాలో మొదటిసారి టిక్కెట్ కొనుగోలు చేసిన రూపా హరీష్ ధావన్ , నానా కకిహారా మిలియనీర్లు అయ్యారు. రూపా హరీష్ ధావన్ 49 ఏళ్ల భారతీయురాలు. ఆమె జనవరి 28న దుబాయ్ నుండి ముంబైకి తిరిగి వచ్చే సమయంలో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 2869తో $1 మిలియన్ గెలుచుకుంది. మొదటి సారి టిక్కెట్ కొనుగోలు చేసిన రూపాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దుబాయ్‌కి వచ్చారు. "దుబాయ్ డ్యూయ్ ఫ్రీకి నా మొట్టమొదటి టిక్కెట్‌తో నా జీవితం మారిపోతుందని నేను నమ్మలేకపోతున్నాను. ఇందుకు దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాను.” అని ఆమె తెలిపింది. రూపా 1999లో ప్రారంభించినప్పటి నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌లో $1 మిలియన్ గెలుచుకున్న 224వ భారతీయురాలు.
యూఏఈ ఉన్న భారతీయురాలు రష్మీ ఫిబ్రవరి 11న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 2478తో మెర్సిడెస్ జి 63 (పోలార్ వైట్) కారును గెలుచుకున్నారు. దుబాయ్‌లో ఉన్న 44 ఏళ్ల భారతీయుడు సీమస్ లూయిస్ ఫిబ్రవరి 5న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0781తో కూడిన అప్రిలియా టువోనో V4 ఫ్యాక్టరీ (టైమ్ అటాక్ - బ్లాక్ రెడ్) మోటార్‌బైక్‌ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







