కోరుకున్న ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.!
- February 22, 2024
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లయిపోయింది. గత మూడేళ్లుగా బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో వుంది రకుల్ ప్రీత్ సింగ్.
ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. ఈ నెల 21న రకుల్ వివాహం గోవాలో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. రామ్ చరణ్, ఎన్టీయార్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే యంగ్ హీరోలతోనూ జత కట్టింది.
ఆ తర్వాత బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్‌ని పక్కన పెట్టింది. గత మూడేళ్లుగా బాలీవుడ్‌లోనే వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో లవ్‌లో పడింది.
తాజాగా ప్రేమ ఫలించి, పెళ్లి పీటలెక్కింది. అయితే, పెళ్లి తర్వాత రకుల్ సినిమాల్లో నటిస్తుందా.? లేదా.? అనేది చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







