‘భారతీయుడు 2’కి రిలీజ్ కష్టాలు తప్పడం లేదా.?
- February 22, 2024
శంకర్ సినిమాలంటేనే చాలా కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. బడ్జెట్ భారీతనం.. సినిమా లార్జ్ స్కేల్ ఓ ఎత్తు.. అయితే, రిలీజ్ కష్టాలు కూడా అంతే ఎత్తుంటాయ్ శంకర్ సినిమాలకి.
ఇక, ఎప్పుడో పూర్తవ్వాల్సిన ఈ సినిమా రకరకాల ఆటంకాలు ఎదుర్కొని ఎట్టకేలకు షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ సినిమా పక్కన పెట్టేసి మరీ, ఈ సినిమాని తిరిగా పట్టాలెక్కించి పూర్తి చేస్తున్నాడు దర్శకుడు శంకర్.
అయితే, ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలా.? అనే అంశంపై చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. నిజానికి సెప్టెంబర్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయ్.
ఏప్రిల్ వరకూ ఎలాగైనా సినిమాని పూర్తి చేయాలన్న కసితో వున్నాడట శంకర్. అలాగే మరోవైపు ప్రి రిలీజ్ బిజినెస్ మీదా ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది.
ఆల్రెడీ ‘భారతీయుడు 2’ బిజినెస్ స్టార్ట్ అయ్యిందట. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా తెలుగు రైట్స్‌ని ఈ సారి సురేష్ ప్రొడక్షన్ష.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా కొనుగోలు చేశారనీ తెలుస్తోంది.
మామూలుగా అయితే, నైజాం రైట్స్‌ని దిల్ రాజు పట్టుకుంటారు. కానీ, ఈ సారి ఎందుకో రాజుగారు వెనక్కి తగ్గారు. ఈ మతలబు వెనక కారణాలేంటో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







