జనవరిలో రికార్డు స్థాయిలో HMC ఆసుపత్రుల సేవ‌లు

- February 23, 2024 , by Maagulf
జనవరిలో రికార్డు స్థాయిలో HMC ఆసుపత్రుల సేవ‌లు

దోహా: హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) జనవరి 2024లో రికార్డు స్థాయిలో వైద్య సేవ‌ల‌ను అందిజేసింది. HMC నివేదిక ప్రకారం.. జనవరి 1 మరియు 31 మధ్య 311,689 ఔట్ పేషెంట్ విజిట్లు నమోదయ్యాయి. అదే స‌మ‌యంలో 34,343 ఇన్‌పేషెంట్ అడ్మిషన్లు నమోదయ్యాయి. "HMC దాని అన్ని ఆసుపత్రులు సేవలలో ప్రతి నెలా పదివేల మంది రోగులకు మ‌ద్ద‌తుగా నిలుస్తుంది. జనవరి 2024లో రికార్డు స్థాయిలో పేషంట్లకు సేవ‌ల‌ను అంద‌జేసాం. ”అని  X ప్లాట్‌ఫారమ్‌లో HMC తెలిపింది. HMCలోని హోమ్ హెల్త్‌కేర్ సర్వీస్ (HHCS) జనవరిలో 5,947 మంది రోగులకు సేవ‌లు అందించింది. HMC ఆసుపత్రులలోని ఏడు అత్యవసర విభాగాలు 55,450 మంది రోగులు సంద‌ర్శించారు.  హమద్ జనరల్ హాస్పిటల్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ సెంటర్, క్యూబన్ హాస్పిటల్, అల్ ఖోర్ హాస్పిటల్, ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, హజ్మ్ మెబైరీక్ జనరల్ హాస్పిటల్, ఐషా బింట్ హమద్ అల్ అత్తియా హాస్పిటల్ మరియు అల్ వక్రా హాస్పిటల్‌లో తీవ్రమైన వైద్య కేసుల కోసం 24 గంటలూ సేవలను అందిస్తాయి. అల్ సద్, అల్ రయాన్, విమానాశ్రయం మరియు దాయెన్‌లోని నాలుగు అత్యవసర కేంద్రాలు (పిఇసిలు) 64,145 మంది రోగులకు చికిత్స అందించాయి.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com