‘గీతాంజలి మళ్లీ వచ్చింది..’ వావ్.! వాట్ ఏ క్రియేటివిటీ.!
- February 23, 2024
2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా మంచి విజయం అందుకుంది. హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది ఈ సినిమా.
శ్రీనివాస్ రెడ్డి, అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకి తాజాగా సీక్వెల్ రూపొందించారు. అదే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలి డబుల్ రోల్ పోషించిన ‘గీతాంజలి’ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారులంతా ఈ సీక్వెల్‌లోనూ కనిపించబోతున్నారు.
అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సినిమా టీజర్‌ని శ్మశానంలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైద్రాబాద్‌లోని బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. ఈ నెల 24 శనివారం రాత్రి 7 గంటలకు శ్మశాన వాటికలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
ఎంత హారర్ మూవీ అయితే మాత్రం మరీ ఇంతలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తారా.? అని అవాక్కవుతున్నారంతా. అంతేకాదు, ‘ఆది పురుష్’ సినిమాకి ధియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటు వదిలిపెట్టినట్లు.. ఈ సినిమా రిలీజ్ చేసే ధియేటర్లలో కూడా ఓ సీటు దెయ్యం కోసం వదిలిపెడతారేమో.. అనుకుంటూ కామెంట్లు కూడా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







