‘ఆపరేషన్ వాలంటైన్’.! రైట్ టైమేనా.!
- February 23, 2024
పరీక్షల కాలం. పెద్ద సినిమాలేమీ ఈ టైమ్‌లో రిలీజ్‌కి రిస్క్ చేయలేవు. కానీ, ఈ టైమ్‌లో ‘ఆపరేషన్ వాలంటైన్’ అంటూ మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగుతున్నాడు.
ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ కుర్రోళ్ల టార్గెట్‌గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. దేశభక్తి, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది.
కానీ, ఎగ్జామ్స్ టైమ్.. ఈ సినిమా నిలదొక్కుకోగలదా.? యూనివర్సిటీలూ, కాలేజీలు.. ఇలా ‘ఆపరేషన్ వాలంటైన్’ టీమ్ బాగానే తిరుగుతోంది. తాజాగా వైజాగ్ గీతమ్ యూనివర్సిటీలో స్పెషల్ ఫెస్ట్‌కి ‘ఆపరేషన్ వాలంటైన్’ టీమ్ రంగం సిద్ధం చేస్తోంది.
అలాగే, ఇంటర్య్వల మీద ఇంటర్వ్యూలిస్తూ.. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా బాగా జరుగుతోంది. కంటెంట్ బాగుంటే.. సినిమాకి ఎలాగైనా ఎట్రాక్ట్ అవుతారు. యూత్, స్టూడెంట్స్ కాస్త రిలీఫ్‌గా కూడా ఫీలవుతారు.
అయితే, కంటెంట్ బాగుండాలంతే. సినిమాపైన చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా వుందనిపిస్తోంది. ఆ నమ్మకం ఎంత మేర నిజమవుతుందో తెలియాలంటే, రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









