‘భీమా’ బ్రహ్మరాక్షసుడుగా గోపీచంద్.! మాస్ పల్స్ పట్టేస్తాడా.?
- February 23, 2024
గోపీచంద్‌కి ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అంటూ ఆ మధ్య కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు కానీ పాపం వర్కవుట్ కాలేదు.
తాజాగా ‘భీమా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రచార చిత్రాలు మాస్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసేలానే వున్నాయ్.
హీరోయిన్స్ గ్లామర్ డోస్ కూడా ఎక్కువే వుంది. రేపు విడుదల కాబోయే ట్రైలర్‌ని బట్టి ఇంకాస్త ఐడియా వస్తుంది. ఇప్పటికైతే.. ‘భీమా’కి పాజిటివ్ సైనే వుంది.
మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సినిమాల్లో ‘హనుమాన్’ తర్వాత వచ్చిన సినిమాలేమీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.
కొన్నిసినిమాలైతే చెప్పుకోదగ్గ లిస్టులోనే లేవు. సో, సినీ ప్రియులకి ఐఫీస్ మూవీ ఒకటి ఖచ్చితంగా పడాలి. అది ‘భీమా’ అయ్యిందంటే గోపీచంద్ లక్కు తోక తొక్కినట్లే.
రాధా మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







