భారతీయులకు కొత్తగా 5 ఏళ్ల మల్టీ ఎంట్రీ వీసాను ప్రకటించారా?
- February 24, 2024
దుబాయ్: గత రేండేళ్లుగా ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసా అన్ని దేశాల పర్యాటకులకు అందుబాటులో ఉందని దుబాయ్ అధికారులు తెలిపారు. భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఐదు సంవత్సరాల మల్టీపుల్ వీసా ప్రారంభించారని పలు భారతీయ మీడియా సంస్థలు గురువారం తెలిపాయి. వాస్తవానికి మల్టిపుల్-ఎంట్రీ పర్మిట్ మొదటిసారిగా 2021లో యూఏఈలో ప్రారంభించారు. ఇటీవల దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ముంబైలో జరిగిన ట్రావెల్ ఎక్స్‌పోలో దీనిని హైలైట్ చేసింది.వీసాకు చేసిన దరఖాస్తును ఆమోదించిన తర్వాత రెండు నుండి ఐదు పని దినాలలో వీసాను జారీ చేస్తారు. వీసా హోల్డర్ 90 రోజుల పాటు యూఏఈ ఉండవచ్చు. అదే వ్యవధికి ఒకసారి పొడిగించుకోవచ్చు. మొత్తం ఒక సంవత్సరంలో 180 రోజులకు మించకూడదు. గత రెండు సంవత్సరాలలో దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం 5-మల్టిపుల్-ఎంట్రీ టూరిస్ట్ వీసాకు సంబంధించి పెరుగుదలను నమోదు చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా ఇండియా నుంచి భారీగా వీసా అప్లికేషన్లు వస్తున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







