షార్జాలో రోడ్డు దాటుతూ..12 ఏళ్ల బాలుడు మృతి
- February 25, 2024
యూఏఈ: షార్జాలో జరిగిన ఘోర ప్రమాదంలో వాహనం ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎమిరేట్‌లోని పాత ఎక్స్‌పో ఇంటర్‌ఛేంజ్ సమీపంలో బాలుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. షార్జా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చిన్నారి ప్రాణాలతో చికిత్స పొందుతూ మరణించాడని షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. సిగ్నల్ రావడంతో వాహన డ్రైవర్ వెళుతుండగా.. బాలుడు అకస్మాత్తుగా ఎడమ వైపు నుండి రావడంతో ఘోర ప్రమాదం జరిగిందన్నారు. వాహనదారుడిపై ట్రాఫిక్ కేసు నమోదు చేసినట్టు.. తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







