దర్శకుడు క్రిష్‌పై ఆ రూమర్లు.! తూచ్ అంతా వుత్తదే.!

- February 28, 2024 , by Maagulf
దర్శకుడు క్రిష్‌పై ఆ రూమర్లు.! తూచ్ అంతా వుత్తదే.!

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు డ్రగ్స్ కేస్ లిస్టులో యాడ్ అయ్యిందనీ.. ఈ విషయం తెలిసిన ఆయన ప్రస్తుతం పరారీలో వున్నారంటూ  ఓ గాసిప్ కొన్ని మీడియా ఛానెల్స్‌లో చక్కర్లు కొట్టింది.

దాంతో ఆయన అభిమానులు అవాక్కయ్యారు. ఆందోళనలో పడ్డారు. తాజాగా ఈ రూమర్‌ని ఖండిస్తూ, దర్శకుడు క్రిష్ స్పందించారు.

తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదనీ, తానెక్కడికీ పారిపోలేదనీ, అసలు ఈ రూమర్ క్రియేట్ కావడానికి కారణం వివరించారాయన.

రెండు రోజుల క్రితమే ఓ ఫ్రెండ్‌ని కలవడానికి క్రిష్ ఓ హోటల్‌కి వెళ్లడంతో ఈ ప్రచారం జోరందుకుంది.  సదరు హోటల్‌లో కొందరు టాలీవుడ్ ప్రముఖుులు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారనీ ఆ లిస్టులో క్రిష్ పేరు కూడా వుందన్నదే ఈ ప్రచారం తాలూకు సారాంశం.

అయితే, ఆ కేస్‌కీ తనకూ ఎలాంటి సంబంధం లేదనీ, పోలీస్ రైడ్ జరగడానికి ముందే తాను ఆ హోటల్ నుంచి బయటికి వచ్చేశాననీ, ఆల్రెడీ పోలీసులకు తాను స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాననీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదనీ ఆయన వివరణ ఇచ్చారు.

దాంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా, డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల పేర్లు వినిపించడం ఈ మధ్య సహజంగా మారిపోయింది. నిజం వున్నా లేకున్నా.. ఆ వార్త ఇట్టే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com