యూఏఈలో వెస్టియన్ కార్యకలాపాలు ప్రారంభం
- March 01, 2024
దుబాయ్: ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన వెస్టియన్.. మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (MEA) కోసం దుబాయ్‌లో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. మధ్యప్రాచ్యంలో డైనమిక్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తన సేవల విస్తరణకు దోహదపడుతుందని వెస్టియన్ సీఈఓ శ్రీని రావు తెలిపారు. పెట్టుబడిదారులకు సమగ్ర పరిష్కారాలను అందించే ప్రత్యేక రియల్ ఎస్టేట్ సలహా సంస్థగా పనిచేస్తుందన్నారు. దుబాయ్ లోని వెస్టియన్ MEA ప్రధాన కార్యాలయం ద్వారా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (MEA) ప్రాంతంలో సేవలు అందిస్తామని వెస్టియన్ ఛైర్మన్ మైఖేల్ సిల్వర్ పేర్కొన్నారు. వెస్టియన్ మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (MEA) ప్రాంతంలో వ్యూహాత్మక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీని కోరుకునే పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుందని వెస్టియన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సరీన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







