బెంగుళూరు కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు
- March 01, 2024
బెంగళూరు: బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది, ఒక కస్టమర్ ఉన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం ఒకటింటికి ఓ బ్యాగ్‌లో ఉంచిన వస్తువు పేలిపోయినట్లుగా తెలుస్తోంది. కానీ పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, వారు క్షేమంగా ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కేఫ్‌లో పేలుడు విషయం తెలియగానే వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోపక్క, ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఫోరెన్సిక్ అధికారులు కేఫ్ వద్దకు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ జాయింట్ కేఫ్‌లలో రామేశ్వరం కేఫ్ ఒకటి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







