ఇండియన్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌కి ఆహ్వానం

- June 03, 2016 , by Maagulf
ఇండియన్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌కి ఆహ్వానం



సుల్తానేట్‌ని వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా మార్చే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం వెడ్డింగ్‌ ప్లానర్స్‌ మరియు ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌తో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇండియాకి చెందిన పలువురు ప్రముఖ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ అలాగే ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. మే 30 నుంచి జూన్‌ 3 వరకు ఈ గ్రూప్‌ ఒమన్‌లో పర్యటించింది. తమ దేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు వెడ్డింగ్‌ డెస్టినేషన్స్‌గా ఉపయోగపడ్తాయనీ, దేశంలో టూరిజంను ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామనీ, ఈవెంట్స్‌ నిర్వహించడానికి, వెడ్డింగ్‌ ఈవెంట్స్‌ జరపడానికి తమ దేశం అనుకూలంగా ఉంటుందని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ టూరిజం ప్రమోషన్‌ అస్మా సలీమ్‌ అల్‌ హజ్రి చెప్పారు. రెండో అతి పెద్ద క్రూయిజ్‌ షిప్‌ పోర్ట్‌ సుల్తాన్‌ ఖబూస్‌లో మే 28 నుంచి కొలువుదీరింది. దీనికి సంబంధించిన విశేషాల్ని కూడా ఇండియన్‌ టీమ్‌కి వివరించారు. మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్‌లో బెస్ట్‌ అనిపించుకునేందుకు టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగంలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలతోపాటు, ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నామని ఒమన్‌ కన్వెన్షన్‌ బ్యూరో డైరెక్టర్‌ ఖాలిద్‌ ఈ సందర్భంగా వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com