‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- March 06, 2024
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 110 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం ‘రైతు నేస్తం’. దశలవారీగా మూడేళ్లలో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తారు. రూ.97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మొదటి దశలో రూ.4.07 కోట్లతో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







