మహా శివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
- March 08, 2024
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలను ఆలయాల నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక తెల్లవారు జాము నుంచే శైవాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ భక్తులు రుద్రాభిషేకాలు చేస్తున్నారు.
ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు తెలంగాణలోని వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో కోడెల మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







