మృణాల్ ఠాకూర్ జోరు హుషారు.!

- March 12, 2024 , by Maagulf
మృణాల్ ఠాకూర్ జోరు హుషారు.!

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తొలి సినిమా సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత నుంచీ ఆమె క్రేజ్ వేరే లెవల్‌కి చేరుకుంది.

అంతేకాదు, ఆమె ఎంచుకుంటున్న సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్స్ అవుతుండడంతో మృణాల్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. లేటెస్ట్‌గా ‘హాయ్ నాన్న’ సినిమాతో నేచురల్ స్టార్ నానికి హిట్టిచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా ప్రోమోలు ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయ్. దాంతో, సినిమాపై పాజిటివ్ సైన్ ఏర్పడింది. ఏప్రిల్‌లో ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొంటోంది మృణాల్ ఠాకూర్. ఆ సంగతి అటుంచితే, మృణాల్ తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది.

మృణాల్ ఠాకూర్ నెక్స్‌ట్ చేయబోయే సినిమా కోసం ప్యాన్ ఇండియా స్టార్‌తో జత కట్టబోతోందనీ తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, ప్రబాస్.

ప్రబాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతోందని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. మృణాల్‌తో  ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి.. తన తదుపరి సినిమాలోనూ లక్కీ బ్యూటీ మృణాల్‌నే ఎంచుకోబోతున్నాడనీ సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com