‘సలార్ 2’.! మొదలెట్టేయడం పక్కా.!
- March 12, 2024
గతేడాది ‘ఆది పురుష్’, ‘సలార్’ సినిమాలతో బాక్సాఫీస్‌ని పలకరించిన ప్రబాస్, ఈ ఏడాది కూడా రెండు సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. అందులో ఒకటి ‘కల్కి 2898 ఏడీ’ కాగా, ఇంకోటి మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ సినిమా.
వీటిలో ‘కల్కి’ ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ‘రాజా సాబ్’ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, ఈ ఏడాదే ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు మారుతి. సో, అలా రెండు సినిమాలు ఈ ఏడాది ప్రబాస్ నుంచి రావడం పక్కా అంటున్నారు.
అలాగే, గతేడాది చివర్లో వచ్చి ప్రబాస్‌కి హిట్టిచ్చిన ‘సలార్’ సినిమాకి సీక్వెల్ ప్రస్థావన జోరుగా వినిపిస్తోంది. కేవలం ప్రస్థావనే కాదు, ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందనీ అంటున్నారు.
ఇంతవరకూ ప్రచారమే జరిగింది. అయితే, ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేశారు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా.
దాంతో ప్రబాస్ ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. తమ అభిమాన హీరో కమిట్మెంట్‌కి సలామ్ కొడుతున్నారు. ఏది ఏమైతేనేం, ప్రబాస్ సినిమా అంటేనే అదో కిక్కు. హిట్టయినా, ఫట్టయినా..!
అలాంటిది హిట్టు సినిమాకి సీక్వెల్ అంటే ఆ అంచనాలు నెక్స్‌ట్ లెవల్ అంతే. ‘సలార్’ రెండో పార్ట్ అంతా శౌర్యంగ పర్వం నేపథ్యంలో వుండబోతున్నట్లు మొదటి పార్ట్‌లోనే హింట్ ఇచ్చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







