ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ లవ్ స్టోరీ.!

- March 16, 2024 , by Maagulf
ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ లవ్ స్టోరీ.!

సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు సోదరుడిగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. తొలి సినిమా నుంచీ డిఫరెంట్ పంథాలో హీరోయిజం చూపిస్తూ వస్తున్నాడు.
లేటెస్ట్‌గా ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో కొత్త లవ్ స్టోరీతో రాబోతున్నాడు. అదే ‘డ్యూయెట్’. మిధున్ వరద రాజ కృష్ణన్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆకాశంలోకి చూస్తున్న ఆనంద్ దేవరకొండ మనసులో ప్రియురాలి ఫోటో కనిపిస్తోంది ఈ పోస్టర్‌లో. పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా వుంది. సినిమా కాన్సెప్ట్ కూడా అంతే డిఫరెంట్‌గా వుండబోతోందట.
జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రితికా నాయక్ ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది.  చూడాలి మరి, ‘బేబీ’ హిట్‌ని ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’తో కంటిన్యూ చేస్తాడో లేదో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com