బుచ్చిబాబు అదే కథని రామ్ చరణ్‌తో కానిచ్చేస్తున్నాడా.?
- March 16, 2024
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఈ సినిమా సెట్స్ మీదికెల్లేందుకు సిద్ధంగా వుంది.
బహుశా మార్చి 20 నుంచి సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతున్నట్లు తాజా సమాచారం. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓ గాసిప్ తాజాగా ఇండస్ర్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
మొదట బుచ్చిబాబు సన, ఎన్టీయార్‌తో సినిమా తెరకెక్కించాల్సి వుంది. అయితే, అది కుదరలేదు. దాంతో, ఆ తర్వాత రామ్ చరణ్ లైన్‌లోకి వచ్చాడు. ఎన్టీయార్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథే, రామ్ చరణ్‌తో తెరకెక్కించేస్తున్నాడట.. అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అంతే కాదు, ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ఈ టైటిల్ పట్ల రామ్ చరణ్ అభిమానులు ఏమంత సంతృప్తికరంగా లేరనీ తెలుస్తోంది. ఎన్టీయార్ కథ, రామ్ చరణ్ వద్దకు రావడమే ఇష్టపడట్లేదట అభిమానులు. కానీ, అసలు ఈ ప్రచారంలో నిజం లేదనీ, ఆ కథ వేరు, ఈ కథ పూర్తిగా వేరు.. అని బుచ్చిబాబు సన్నిహితులు వాదిస్తున్నారు.
ఏది ఏమైతేనేం, బుచ్చిబాబు విషయమున్న డైరెక్టర్. అందులో నో డౌట్. అన్నట్లు ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష