బైకర్ అజాగ్రత్తతో ఘోర ప్రమాదం..21 మంది దుర్మరణం
- March 17, 2024
అప్ఘానిస్థాన్: అప్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అప్ఘానిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్ లోని గెరాష్క్ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక ట్రాఫిక్ నియంత్రణ అధికారి క్వద్రాతుల్లా వెల్లడించారు. ఒక బైకర్ తప్పిదంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్‌కు వెళ్తున్న బస్సును ఓ బైకర్ వచ్చి ఢీకొట్టాడు. దాంతో.. కంగారుపడిపోయిన బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై అదుపు కోల్పోయాడు. దాంతో.. బస్సు రోడ్డు పక్కనే ఉన్న ఆయిల్ ట్యాంకర్ పైకి దూసుకెళ్లింది. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు