జీసీసీ దేశాల్లో తాగునీటికి పొంచిఉన్న ప్రమాదం?
- March 17, 2024
కువైట్: GCC ప్రాంతంలోని దేశాలు ప్రపంచంలోని అత్యంత ఎడారి వాతావరణంలో ఉంటాయి. ఇక్కడ తాగునీరు అనేది చాలా కీలకమైనది. కువైట్లో ఎనిమిది ప్రాంతంలో 157 డీశాలినేషన్ ప్లాంట్లు ఉండగా, గత రెండు దశాబ్దాలుగా లవణీయత(సాల్ట్) పెరుగుదల కనిపించింది. ఇది స్థాయిలు 55 శాతానికి మించి ఉంటే ముప్పుగా పరిణమిస్తుంది. GCC స్టాటిస్టికల్ సెంటర్ గత నివేదికల ప్రకరాం.. ప్రతి వ్యక్తికి సగటున నీటి వినియోగం 295 లీటర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని దేశాలకు ఈ శాతం ముప్పుగా భావిస్తారు. దీంతోపాటు వాతావరణ మార్పు అనేది కూడా తాగునీటు వనరులను తగ్గిస్తున్నాయి. సాంప్రదాయ డీశాలినేషన్ ప్రక్రియ లవణీయత పెరుగుదలకు కారణమైందని కువైట్ యూనివర్శిటీ (KU) కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో శాస్త్రీయ, పరిశోధన మరియు ఉన్నత విద్యా వ్యవహారాల వైస్ డీన్ అల్ ఎనేజీ(Al-Enezi) వెల్లడించారు. ప్రస్తుత ప్రక్రియ వల్ల ఎక్కువ ఉప్పు మరియు కాలుష్య కారకాలను ఉత్పత్తి చేయడం వల్ల పాత సాంకేతికతలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడం చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న కువైట్ తీరప్రాంతంలో లవణీయత స్థాయి 45 నుండి 50 శాతం వరకు ఉందని, అయితే 60కి చేరుకోవచ్చని, ఇది ప్రమాదకర శాతం అని హెచ్చరించాడు. పర్యావరణ పబ్లిక్ అథారిటీ (EPA) ఆమోదించిన మూడు పరిష్కార ప్రాజెక్టుల ద్వారా లవణీయతను తగ్గించడం, అదే సమయంలో పర్యావరణాన్ని రక్షించడం లక్ష్యంగా రెండు కొత్త డీశాలినేషన్ టెక్నాలజీలు ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు