కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేంటో తెలుసా.?
- March 18, 2024
ఆరోగ్యంగా వుండేందుకు అన్నిమూలకాల్లోనూ కాల్షియం అధికంగా వుండడం అత్యుత్తమం. ఎముకలు ధృడంగా వుండేందుకు, రక్తం గడ్డ కట్టడం, కండరాల నొప్పులు లేకుండా వుండడం.. ఇలా చాలా రకాల పనులకు శరీరానికి కాల్షియం అవసరం. మరి, కాల్షియం కోసం ఏ ఏ ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.? తెలుసుకుందాం.
వయసు పైబడే కొద్దీ శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంటుంది. తద్వారా కీళ్లు, కండరాల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతుంటాయ్. అందుకే 50 సంవత్సరాలు పైబడిన వారు ప్రత్యేకంగా కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాల్ని తీసుకోవాలి. అలాగే, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సైతం కాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది.
మరి, కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేవి.? పాలు పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా వుంటుంది. అలాగే, ఆకు కూరలు కూడా వారంలో ఓ ఆర్డర్‌లో తీసుకోవాల్సిన ఆవశ్యకత వుంది.
నువ్వులు, రాగులు వంటి చిరు ధాన్యాల్లో కాల్షియం అధికంగా వుంటుంది. వీటిని జావ రూపంలో కానీ, స్వీట్లు ఇతరత్రా వంటకాల రూపంలో కానీ రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.
మాంసాహారులు చేపలు, మాంసం, గుడ్లు వంటి మాంసాహార ఉత్పత్తుల్ని తీసుకోవాలి. అలాగే శాఖా హారులకు చియాన్ గింజలు ఆయా మాంసాహార ఉత్పత్తుల్లో వుండే కాల్షియంని పుష్కలంగా అందిస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు