హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- March 19, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతులెత్తేసింది. పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసిన రియల్ ఎస్టేట్ యాజమాన్యం కోట్ల రూపాయలతో హుడాయించిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
పెట్టుబడులంటూ అమాయకులను మోసం చేసి సుమారు రూ. 500 కోట్లు వసూలుకు పాల్పడి డబ్బుతో పారిపోయినట్టు బాధితులు వాపుతున్నారు. సుమారు 500 మంది ఏజెంట్‌లను ఏర్పాటు చేసుకుని సుమారు 7వేల మంది కొనుగోలుదారులను మోసం చేసింది. భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి భారీ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు.
జనగామ ప్రాంత చివారులో తక్కువ రేట్‌లలో భూములు తీసుకొని బై బ్యాక్ ఆఫర్ అంటూ నమ్మబలికి కొంతమందికి ఈ భూమిని గుంట లెక్కన ఫార్మ్ లాండ్‌గా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, చాలామంది కస్టమర్స్ అగ్రిమెంట్ మీదనే కనీసం లక్ష కడితే.. నెలకు 8వేల చొప్పున 20 నెలలకు లక్ష 60వేలు ఇస్తామని చెప్పారని, కొన్ని నెలలు ఇచ్చినట్టు ఇచ్చి అందరిని మోసగించినట్టు బాధితులు వాపోతున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి పారిపోయిన నిందితులపై ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు