‘ఉస్తాద్’ రెడీ అవుతున్నాడు బాస్.!
- March 19, 2024
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావల్సి వుంది. కానీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ నిమిత్తం అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
అయితే ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కబోతోందనీ తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారట.
త్వరలోనే షూట్‌లో పాల్గొంటారనీ తెలుస్తోంది. అంతేకాదు, అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా వదలబోతున్నారనీ టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్ బంప్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
‘ఈ సారి సౌండ్ బద్దలైపోద్ది..’ అంటూ వదిలిన ఆ గ్లింప్స్‌కి ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక త్వరలో రిలీజ్ కాబోయే టీజర్‌లో ఎలాంటి పవర్ ఫుల్ డైలాగులు, సన్నివేశాల్ని చొప్పించబోతున్నాడో హరీష్ శంకర్ చూడాలి మరి.
శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ ‘తెరి’కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు