కువైట్ లో పొగమంచు..వాహనదారులకు అలెర్ట్

- March 20, 2024 , by Maagulf
కువైట్ లో పొగమంచు..వాహనదారులకు అలెర్ట్

కువైట్: మంగళవారం అర్ధరాత్రి నుంచి వాతావరణం క్రమంగా మెరుగుపడుతోందని, మేఘాలు తగ్గుముఖం పట్టడంతోపాటు వర్షం కురిసే అవకాశాలు క్రమంగా కనుమరుగవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా రాబోయే కొన్ని గంటలలో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశాలను శాఖ తెలియజేసింది. శుక్రవారం ఉదయం మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపై సిగ్నల్స్ ను ఫాలో కావాలని, పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని, ప్రయాణించే సమయంలో వార్నింగ్ లైట్స్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com