వెదర్ అలెర్ట్.. యూఏఈకి భారీ వర్ష సూచన
- March 20, 2024
యూఏఈ: యూఏఈలో ఈ వీకెండ్ నుంచి వాతావరణం మారిపోనుందని వాతావరణ విభాగం వెల్లడించింది. తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) తెలిపింది. అయితే, మంగళవారం సాయంత్రానికి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. బలమైన గాలులు ఆగ్నేయం నుండి ఈశాన్య మరియు వాయువ్య దిశకు మారతాయని, దీంతో గాలుల తీవ్రత పెరుగుతాయని పేర్కొంది. వీటి కారణంగా దుమ్ము మరియు ఇసుక తుఫానులు వీచే అవకాశం ఉందని, రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా తగ్గుతుందని హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొవాలని సూచించింది. కాగా, కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం (10మి.మీ మరియు 40మి.మీ మధ్య) కురిసే అవకాశం ఉందని, అంతర్గత ప్రాంతాలలో భారీ వర్షపాతం (50 మిమీ మరియు 80 మిమీ మధ్య) ఉంటుందని తెలిపింది. అదే సమయంలో అబుదాబి, దుబాయ్ మరియు షార్జా తీర ప్రాంతాలలో 15 మిమీ - 50 మిమీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు