జేజమ్మ మళ్లీ వస్తోంది.!
- March 20, 2024
స్వీటీ అని పిలుచుకున్నా.. జేజమ్మ అని పిలుచుకున్నా.. అనుష్క రేంజే వేరు. ‘సైజ్ జీరో ’ సినిమా తర్వాత అనుష్క బరువు పెరగడంతో సినిమాలు తగ్గించేసింది.
గతేడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. ఫ్యాన్స్‌కి సరికొత్త కిక్కిచ్చింది. అయితే, అప్పటికే కమిట్ అయిన సినిమా కాబట్టి.. ఆ సినిమాని ఎలాగోలా పూర్తి చేసింది కానీ, అనుష్క ఇకపై సినిమాల్లో నటించేది లేదనుకున్నారంతా.
కానీ, సైలెంట్‌గా అనుష్క ఇంకో సినిమాలో నటించేసింది. అదే ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
చీరకట్టులో ముఖానికి ముసుగు వేసుకున్న అనుష్క కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో ఎడారి కనిపిస్తోంది. చూస్తుంటే ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తోంది. నో డౌట్.. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే.
క్రిష్ కొన్ని డిఫరెంట్ మూవీస్‌ని చాలా చాకచక్యంగా సింపుల్దగా తెరకెక్కించేస్తుంటాడు. గతంలో వచ్చిన ‘కొండపొలం’ ఆ కోవకు చెందిన సినిమానే. అలాంటిదే ఇప్పుడు స్వీటీతో తెరకెక్కిస్తున్న ‘ఘాటి’ చిత్రం కూడా.
అన్యాయానికి గురైన ఓ మహిళ చేసే న్యాయ పోరాటమే ఈ సినిమా. చూడాలి మరి, అనుష్క ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో. త్వరలోనే ‘ఘాటి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







