గుండె సమస్యలున్న వాళ్లు వేరు శనగలు తినకూడదా.?
- March 20, 2024
డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పల్లీలు (వేరు శెనగలు) తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలలో చాలా మంచి పోషకాలున్నాయ్. వాటిని వంటల్లో వాడుకోవడం మంచిదే. అలాగే, డ్రై రోస్ట్ చేసుకుని, లేదంటే ఉడికించుకుని స్నాక్స్‌లా తినడం కూడా మంచిదే.
ఉడికించిన పల్లీలు తింటే ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. అయితే, ఆయిల్, మసాలా మిక్స్ చేసిన పల్లీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు.
పల్లీల్లో నియాసిన్, విటమిన్ ఇ, థయామిన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ సెలీనియం, బి విటమిన్స్ పుష్కలంగా వుంటాయ్.
అయితే, అతి సర్వత్రా వర్జ్యయేత్ కదా. పల్లీలను కూడా మితంగానే తీసుకోవాలి. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుండడం వల్ల తక్కువగా తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో వుంటుంది. అతి అయితే, అధికమవుతుంది.
ఉడికించిన వేరు శెనగలు తింటే డయాబెటిస్ వున్నవారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో వుంటాయ్.
గుండె సమస్యలున్నవాళ్లు వారంలో రెండు లేదా మూడు సార్లు ఉడికించిన పల్లీలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు రక్తపోటుని బ్యాలెన్స్‌డ్‌గా వుంచడంలో తోడ్పడతాయ్. అందు వల్ల గుండె ఆరోగ్యానికి ఎటువంటి హానీ వుండదు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







