తెలంగాణలో ఈ ఐదు రోజులు ఎండలే ఎండలు
- March 24, 2024
హైదరాబాద్: తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రానున్న ఈ 5 రోజులు మరింత గా ఉండబోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికార్డవుతున్న టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశామని చెప్పింది.
హైదరాబాద్‌లోనూ వచ్చే 5 రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఉదయం పూట మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్ కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..







