భారత కార్మికుల క్యాంప్ ని సందర్శించిన మొదీ
- June 05, 2016
ఆయన ఒక దేశానికి ప్రధాని.. కానీ ఓ సాధారణ వ్యక్తిలాగా కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆయన మరెవరో కాదు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రస్తుతం మోదీ ఖతార్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం ఆయన దోహలోని భారత కార్మికుల క్యాంప్‌ను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కలిసి మాట్లాడారు. భారత కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల ఇబ్బందులను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. వారితో కలిసి కూర్చొని అక్కడే భోజనం చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్మికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 'మా కుటుంబ సభ్యుల్లోని వ్యక్తి మాతో భోజనం చేసినట్లుందని చెమర్చిన కళ్లతో ఓ కార్మికుడు తన ఆనందాన్ని పంచుకున్నాడు.మోదీ ఉత్తమ ప్రధాని. ఆయన మాతో కలిసి కూర్చున్నారు. మా సమస్యలను అడిగి తెలుసుకున్నార'ని మరో కార్మికుడు తెలియజేశాడు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై దేశాధినేతలు చర్చలు జరపనున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







