పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించనున్న తెలంగాణా సర్కారు
- June 05, 2016
వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో లక్ష కనెక్షన్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టి రెండేళ్ల పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సమర్థ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుని మోదీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. గత యూపీఏ హయంలో సగం మంది మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నారని మంత్రి విమర్శించారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో మల్లవరం నుంచి రామగుండం ఎరువుల కర్మాగారానికి ప్రత్యేక గ్యాస్ పైప్‌లైన్ వేయనున్నట్లు ప్రధాన్ తెలిపారు. 2021 కల్లా రెండున్నర లక్షల మందికి హైదరాబాద్‌లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 23 వేల వాహనాలు సీఎన్జీతో నడుస్తున్నాయని మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. గరీబీ హఠావో అంటూ కాంగ్రెస్ గొంతు చించుకొని చేసిందేమీ లేదని సమావేశానికి హాజరైన మరో కేంద్రమంత్రి రామ్‌కృపాల్‌యాదవ్ అన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







