హైదరాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసు ప్రారంభం
- April 02, 2024
హైదరాబాద్: స్పైస్జెట్ తో హైదరాబాద్ నుంచి అయోధ్యకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు SG611 విమానం 10:45 గంటలకు బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SG616 విమానం అయోధ్య నుంచి 13:25 గంటలకు బయలుదేరి 15:25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ - స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, "అయోధ్య నగరం మరియు సమీపంలోని సాంస్కృతిక మరియు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ప్రయాణికలకు ఈ కొత్త సేవను ప్రవేశపెట్టడం మాకు సంతోషంగా ఉంది. విమానయాన సంస్థలతో కలిసి ప్రయాణికలకు మెరుగైన సేవలు అందిస్తూ హైదరాబాద్ విమానాశ్రయం తమ మార్గాలను విస్తరించేందుకు నిరంతరంగా కృషి చేస్తోందన్నారు.”
పవిత్ర నగరంగా గుర్తింపు పొంది, శ్రీరాముడి జన్మస్థలంగా పూజలందుకుంటున్న అయోధ్యకు మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత ఉంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!