ఒమన్‌లో భారీ ట్రక్కులపై నిషేధాజ్జలు

- June 05, 2016 , by Maagulf
ఒమన్‌లో భారీ ట్రక్కులపై నిషేధాజ్జలు


 
రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఒమన్‌లో భారీ ట్రక్కుల రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు అలాగే, మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ఆదివారం నుండి సోమవారం వరకు వీటి రాకపోకలపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుంది. రమదాన్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూసే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. 10 మెట్రిక్‌ టన్నుల్ని మించి బరువుతో ఉండే వాహనాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ స్టేటస్‌ అండ్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, రమదాన్‌ సందర్భంగా ఒక షిఫ్ట్‌ మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ షిఫ్ట్‌ పనిచేస్తుంది. మిగతా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ యూనిట్స్‌కి ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పని సమయం ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com