ఒమన్‌లో భారీ ట్రక్కులపై నిషేధాజ్జలు
- June 05, 2016
రాయల్ ఒమన్ పోలీసులు ఒమన్‌లో భారీ ట్రక్కుల రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు అలాగే, మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ఆదివారం నుండి సోమవారం వరకు వీటి రాకపోకలపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుంది. రమదాన్ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 10 మెట్రిక్ టన్నుల్ని మించి బరువుతో ఉండే వాహనాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ స్టేటస్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రమదాన్ సందర్భంగా ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ షిఫ్ట్ పనిచేస్తుంది. మిగతా రాయల్ ఒమన్ పోలీస్ యూనిట్స్‌కి ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పని సమయం ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







