అంతర్జాతీయ క్రీడా దినోత్సవం

- April 06, 2024 , by Maagulf
అంతర్జాతీయ క్రీడా దినోత్సవం

డలు మనల్ని శారీరకంగా చురుకుగా, పోటీగా మరియు ఫిట్‌గా ఉంచడం జరుగుతుంది.  మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా విలువైన జీవిత పాఠాలను  క్రీడలు  నేర్పుతాయి. ఇప్పటికీ క్రీడల ప్రాధాన్యం ఏమిటో, అసలు క్రీడా దినోత్సవాన్ని  ఏ రోజున జరుపుకొంటారో తెలియని యువత ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం (IDSDP) ఏప్రిల్ 6న జరుగుతుంది.

 అసమానమైన ప్రజాదరణ మరియు సానుకూల విలువల పునాది కారణంగా, ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు  దోహదపడేందుకు క్రీడా రంగం సరైన వేదిక . క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 23, 2013న ఆమోదించడం ద్వారా అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవంగా ఏప్రిల్ 6ని ప్రకటించింది. 
"శాంతియుత మరియు సమ్మిళిత సమాజాల ఉన్నతి కోసం క్రీడలు " ఈ సంవత్సరం యొక్క అధికారిక థీమ్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ అభివృద్ధి మరియు శాంతి కోసం పనిచేస్తున్న సంబంధిత అంతర్జాతీయ సంస్థలు మరియు అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు జాతీయ క్రీడా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు మరియు ప్రైవేట్ రంగంతో సహా పౌర సమాజం ఈ కార్యక్రమంలో భాగస్వాములు.

క్రీడలు శారీరక సామర్థ్యాన్ని మరియు మానసిక వికాసాన్ని పెంపొందించడంలో  సహాయపడతాయి. అంతేకాకుండా, సామాజిక ఏకీకరణ, లింగ సమానత్వం, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ సహకారం, సోదర భావాన్ని పెంపొందించడంలో కీలకమైన క్రీడలు కీలకమైన పాత్ర పోషిస్తాయి .

        --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com